డ్రాగన్ ఫ్రూట్ అనేది పోషక విలువలతో నిండిన ఆరోగ్యపరమైన పండు. ఇందులో కొలెస్ట్రాల్, సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఇందులోని ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ గుండెను బలంగా ఉంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అయిన బీటాసయానిన్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ C లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి క్యాన్సర్ ఏర్పడే అవకాశాన్ని తగ్గిస్తాయి.

ఈ పండులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ లు ఉండటంతో ఎముకలు బలంగా తయారవుతాయి. ఎముకల బలహీనతను నివారించడంలో ఇది సహాయపడుతుంది.
ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగవుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గిపోతాయి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా నిండిన భావన కలిగి ఎక్కువగా తినకుండా ఉంటుంది, తద్వారా బరువు నియంత్రించవచ్చు.

డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగనీయదు. అందువల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచిది. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి వయసు వచ్చాక కూడా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
ఇది జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి, దాన్ని మందంగా, పొడవుగా పెరగేలా చేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా మెరుస్తుంది.