మెగా ఫ్యామిలీలో మధురక్షణాలు నెలకొన్నాయి. టాలీవుడ్ జంట వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి తమ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోందని అధికారికంగా ప్రకటించారు. తల్లిదండ్రులుగా మారబోతున్నామన్న గుడ్ న్యూస్‌ను వరుణ్ తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రపంచంతో పంచుకున్నారు. “మా జీవితంలో అత్యంత ఆనందదాయకమైన బాధ్యతను స్వీకరించబోతున్నాం” అని పేర్కొంటూ ఓ హృదయాన్ని తాకే పోస్ట్ చేశారు.

ఈ వార్త వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ ముంచెత్తుతోంది. మెగా ఫ్యామిలీ అభిమానుల నుంచి, టాలీవుడ్ సెలెబ్రిటీల నుంచి వరుణ్ – లావణ్య దంపతులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘మెగా వారసుడు రాబోతున్నాడు’’ అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రేమ, వివాహం.. ఇప్పుడు తల్లిదండ్రుల పథం
వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ప్రేమకథ 2017లో ‘మిస్టర్’ సినిమా సెట్స్‌పై మొదలైంది. ఆ తర్వాత ‘అంతరిక్షం’ సినిమాలో కలిసి నటించిన సమయంలో వారి మధ్య ప్రేమ ముదిరినట్లు తెలుస్తోంది. కానీ తన ప్రేమ విషయాన్ని చాలా రోజుల పాటు రహస్యంగానే ఉంచారు. 2023లో నిశ్చితార్థం ద్వారా తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించగా, అదే ఏడాది నవంబర్ 1న ఇటలీలోని టస్కానాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.
వివాహం తర్వాత వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీగా ఉంటే, లావణ్య మాత్రం సినిమాలకు కొంత దూరంగా ఉంటూ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం తల్లిదండ్రులుగా మారబోతున్న ఈ జంటకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున ప్రేమాభివందనలు వెల్లువెత్తుతున్నాయి.