గేమ్ ఛేంజర్ సినిమాతో విమర్శలను ఎదుర్కొన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాతో మళ్ళీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ టీజర్లో చరణ్ మాస్ అవతారంలో క్రికెట్ ఆడుతున్న సీన్ ఒక్కసారిగా హైలైట్ అయింది. చరణ్ సిగ్నేచర్ సిక్స్ షాట్ టీజర్ హైలైట్‌గా నిలిచింది.

అయితే ఇదే సీన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ టీం ప్రత్యేకంగా రీ-క్రియేట్ చేసింది. ఐపీఎల్ 2025 సీజన్లో SRH vs DC మ్యాచ్‌కు ముందు రిలీజ్ చేసిన ఈ వీడియోలో ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ ప్లేయర్ సమీర్ రజ్వీ, చరణ్ స్టైల్లో బ్యాట్ ఉంచి ఒక మాస్ సిక్స్ కొడతాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ పేజీకి అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. ‘పెద్ది’ సినిమా క్రేజ్‌ను హైలైట్ చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ప్రోమోషనల్ వీడియో రిలీజ్ చేయడం విశేషం.
ఈ వీడియోపై రామ్ చరణ్ స్పందిస్తూ – “ధన్యవాదాలు ఢిల్లీ క్యాపిటల్స్. మీ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్!” అంటూ తన అధికారిక సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు. దీని వల్ల ‘పెద్ది’ సినిమా క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఈ రోజు జరగబోయే SRH vs DC మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. హైదరాబాద్ 9వ స్థానంలో ఉండగా, ఢిల్లీకి ప్లేఆఫ్ ఆశల కోసం ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సిన అవసరం ఉంది.
https://www.instagram.com/reel/DJQ-Z35vG9O/?utm_source=ig_web_copy_link