• Home
  • health
  • నెలరోజుల పాటు టీ తాగకపోతే శరీరంలో జరిగే అద్భుత మార్పులు!
Image

నెలరోజుల పాటు టీ తాగకపోతే శరీరంలో జరిగే అద్భుత మార్పులు!

మన దేశంలో టీ ప్రియులు ఎందరో ఉన్నారు. రోజు టీ తాగకపోతే పని మొదలయ్యేలా ఉండదనే స్థాయికి అలవాటు అయిపోయారు. అయితే ఆరోగ్య నిపుణుల చెబుతున్నదాని ప్రకారం, ఒక నెల రోజుల పాటు టీ, కాఫీ తాగకపోతే శరీరంలో అనేక లాభదాయకమైన మార్పులు జరుగుతాయి.

ముఖ్యంగా నిద్ర నాణ్యతలో స్పష్టమైన మెరుగుదల ఉంటుంది. టీ లో ఉండే కెఫైన్‌ నిద్రలేమికి కారణమవుతుంది. టీ మానేసినవారు ఎక్కువ సమయం నిద్రపోతారు, తొందరగా పడుకుంటారు అని అధ్యయనాల్లో తేలింది.

ఇక రక్తపోటు విషయానికి వస్తే, టీ మానడం ద్వారా బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. షుగర్ లెవల్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. టీ అధికంగా తాగేవారిలో గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నెల రోజుల పాటు టీ మానేస్తే ఈ సమస్యలు తగ్గుతాయి. అలాగే, టీ వల్ల దంతాలపై పసుపు పదార్థం పేరుకుపోతుంది. దీని వలన పళ్ళు మారగడం, మొరిగిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. టీ మానినవారు ఎక్కువగా హైడ్రేటెడ్‌గా, చురుకుగా ఉంటారు. ఆరోగ్య పరంగా ప్రయోజనాలు పొందాలనుకుంటే కనీసం ఒకసారి టీ తాగడం మానడం ట్రై చేయవచ్చు. అయితే, ఈ సమాచారం ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మాత్రమే. ఎలాంటి వైద్య సమస్యలైతే ఉన్నా నేరుగా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

Releated Posts

డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు: గుండె, చర్మం, జీర్ణవ్యవస్థకు ఆహార సొంపులు!

డ్రాగన్ ఫ్రూట్ అనేది పోషక విలువలతో నిండిన ఆరోగ్యపరమైన పండు. ఇందులో కొలెస్ట్రాల్, సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.…

ByByVedika TeamMay 7, 2025

వేసవిలో బెల్లం నీళ్లు తాగితే కలిగే అద్భుత లాభాలు – శరీరాన్ని చల్లగా ఉంచే సహజ మంత్రం!

వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసిపోతుంది. అలాంటి సమయాల్లో బెల్లం నీళ్లు తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. బెల్లంలో ఉన్న…

ByByVedika TeamMay 2, 2025

ప్రతిరోజూ ఎంత చక్కెర తినాలో తెలుసా? WHO సూచనలు తప్పనిసరిగా తెలుసుకోండి!

ఈ రోజుల్లో అధికంగా చక్కెర తీసుకోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఊబకాయం, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు, ఫ్యాటీ లివర్ వంటి…

ByByVedika TeamMay 1, 2025

Cucumber Health Benefits–హైడ్రేషన్ నుంచి బరువు తగ్గేవరకు అనేక ప్రయోజనాలు!

కీర దోసకాయలు తక్కువ కేలరీలు, అధిక నీటి శాతం, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో పోషక విలువలతో నిండిన ఆరోగ్యవంతమైన కూరగాయలు. వీటిలో హైడ్రేషన్, జీర్ణక్రియ…

ByByVedika TeamApr 30, 2025

Leave a Reply