స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగింది. ‘పుష్ప’, ‘ఛావా’ వంటి సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న రష్మిక ఇటీవల బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన ‘సికిందర్’ సినిమాలో నటించినా, అది ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక, సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన డైరీ నోట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

రష్మిక ఇలా వ్రాసింది: “ఊటీ నుంచి కోయంబత్తూర్ మీదుగా హైదరాబాద్ వచ్చా, షూటింగ్ రద్దయింది. ఇంటికి వచ్చి పెండింగ్ పనులు చూసి షాక్ అయ్యా. పనిలో ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తుకురావు. నా చెల్లి బర్త్‌డే కావడంతో ఫోన్ చేసి మాట్లాడా. తర్వాత కొంత సమయం ట్వీట్లకు రిప్లై ఇచ్చాను. వర్కౌట్ కి టైం దొరకకపోయినా కార్డియో మాత్రం చేశా. డిన్నర్ తర్వాత మా అమ్మ, చెల్లితో చాటింగ్ చేశా. టైం వేగంగా వెళ్తే మనం మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాం అనిపిస్తుంది.”
చివరగా రష్మిక చిన్న పిల్లలు, అమ్మాయిలకు ఇలాగే సలహా ఇచ్చింది: “మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు ముందుగా తెలుసుకోండి. అందరూ చెడ్డవారు కాకపోయినా, మన స్నేహితులు మంచి వాళ్లు కాకపోవచ్చు. నేడు మీ ఫ్రెండ్ అయినవారు, రేపు కాదేమో. అలాగే మీ తల్లి దండ్రులను ప్రేమించండి, గౌరవించండి. వాళ్లు చెప్పే సలహాలు నిజంగా ఎంతో విలువైనవి.” ఈ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
