భారత రైల్వే శాఖ స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన వందేభారత్ స్లీపర్ రైళ్లను తెలుగు రాష్ట్రాలకు చేరేలా సిద్ధమైంది. ఇవి రాత్రి ప్రయాణాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. వీటిలో 16 కోచ్‌లు, 1,128 బెర్తులు ఉంటాయి. పగటి వేళల్లో ప్రయాణించే వందేభారత్ రైళ్లతో పాటు, రాత్రి ప్రయాణాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటాయి.

వందేభారత్ స్లీపర్ రైళ్లతో ప్రయాణ అనుభవం
ఈ రైళ్లలో ప్రయాణికులకు ఏపీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏసీ, 3-టైర్ ఏసీ వసతులు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లతో, లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా, వేగంగా జరగనున్నాయి.
ప్రయాణ రూట్లపై నిర్ణయం
విజయవాడ నుంచి అయోధ్య/వారణాసి, సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించేందుకు నిర్ణయించారట. రైల్వే శాఖ ఈ రైళ్లకు కేటాయించిన ప్రధాన రూట్లు రాష్ట్రంలోని ప్రముఖ నగరాలు మరియు ధార్మిక కేంద్రాలను కలుపుతాయి.
ప్రథమ విడతలో 9 స్లీపర్ రైళ్ల ప్రారంభం
తెలుగు రాష్ట్రాలకు రాబోయే రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు మొదటి విడతలోనే అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి రైళ్ల డిమాండ్ పెరిగిందనే కారణంతో, కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.