వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసిపోతుంది. అలాంటి సమయాల్లో బెల్లం నీళ్లు తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. వేసవిలో చెమట వల్ల దేహంలో నీరు తగ్గినప్పుడు బెల్లం నీళ్లు ఎలక్ట్రోలైట్లు సమకూర్చి డీహైడ్రేషన్‌కు అడ్డుకడతాయి.

ఇది బీపీ నియంత్రణలోకి తేస్తుంది, తలనొప్పులు, అలసట తగ్గుతుంది. శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లడంతో చర్మం ఆరోగ్యంగా మారుతుంది. స్కిన్ గ్లో పెరిగి మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి.
హిమోగ్లోబిన్ స్థాయి పెంచడంలో కూడా ఇది కీలకం. రక్తహీనత తగ్గుతుంది, ముఖ్యంగా మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరం. బెల్లం నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు దూరంగా ఉంటాయి.
ఇది లివర్‌ను శుభ్రంగా ఉంచుతుంది, బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రక్రియను సహజంగా చేస్తుంది. వేసవిలో వచ్చే వడదెబ్బ, తల తిరుగుడు, నీరసం వంటి సమస్యలు నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచి గట్ హెల్త్‌ను బలోపేతం చేస్తుంది.
ఈ నీళ్లు రోజూ తాగడం వల్ల శరీరం చల్లగా ఉండి, శక్తివంతంగా ఉంటుంది. ఇది ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరికీ ఉపయుక్తమైన వేసవి మంత్రం!