ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్’ (WAVES) ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఘనంగా ప్రారంభించారు. నాలుగు రోజులపాటు ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్ జరగనుంది. “కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ వేదికను నిర్వహిస్తున్నారు. ఇది మీడియా, వినోద రంగానికి చెందిన ప్రముఖులను ఒకే చోట చేర్చే ఆవిష్కరణ.

ఈ కార్యక్రమంలో బాలీవుడ్ దిగ్గజులు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా, రణ్‌బీర్ కపూర్‌తో పాటు దక్షిణాదికి చెందిన రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్ వంటి స్టార్లు హాజరయ్యారు. మోదీ మాట్లాడుతూ వేవ్స్ అనేది ఓ పదం మాత్రమే కాదు, ఇది భారత సాంస్కృతిక సృజనాత్మకతకు ప్రాతినిధ్యం వహించే వేదిక అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రజనీకాంత్, మోహన్ లాల్, చిరంజీవి, హేమ మాలిని, అక్షయ్ కుమార్, మిథున్ చక్రవర్తి కలిసి దిగిన గ్రూప్ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ పిక్ చూసిన నెటిజన్లు “అలనాటి మెగా స్టార్స్‌ని ఒకే ఫ్రేమ్‌లో చూడడం గర్వకారణం” అంటూ ప్రశంసిస్తున్నారు. చిరంజీవి ఈ సమ్మిట్ కోసం బుధవారమే ముంబై చేరుకున్నారు.