ఈ రోజుల్లో అధికంగా చక్కెర తీసుకోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఊబకాయం, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతిరోజూ ఎంత చక్కెర తినాలో తెలుసుకోవడం చాలా అవసరం.

WHO సూచనల ప్రకారం:
పురుషులు – రోజుకు గరిష్ఠంగా 36 గ్రాములు (సుమారు 9 టీస్పూన్లు)
పిల్లలు (2–18 ఏళ్లు) – రోజుకు గరిష్ఠంగా 25 గ్రాములు (సుమారు 6 టీస్పూన్లు)
2 ఏళ్ల లోపు చిన్నారులు – అదనపు చక్కెర పూర్తిగా నివారించాలి
అధిక చక్కెర తినడం వల్ల శరీరంలో కేలరీలు అధికమై బరువు పెరుగుతుంది. దీంతో గుండె బలహీనపడుతుంది, రక్తంలో ట్రైగ్లిసరైడ్లు పెరుగుతాయి. కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
చిన్నప్పటి నుంచే తక్కువ చక్కెర తినే అలవాటు పెడితే పెద్దయ్యాక ఆరోగ్య సమస్యలు తక్కువగా వస్తాయి. పండ్లు వంటి సహజమైన తీపిని ప్రాధాన్యత ఇవ్వాలి. రోజూ తినే పదార్థాల్లో చక్కెర పరిమాణాన్ని గమనించి, అవసరానికి మించిన తీపి తీసుకోకుండా జాగ్రత్త పడాలి.