వినోద ప్రపంచం ఎప్పుడూ గ్లామర్, ప్రతిష్టతో పాటు సంపదకు చిహ్నంగా నిలుస్తుంది. హిట్ సినిమా తర్వాత నటులు లక్షలే కాక కోట్ల రూపాయలు సంపాదించి విలాసవంతమైన జీవితం గడుపుతుంటారు. తాజాగా వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసిన టాప్ 10 ధనవంతులైన నటుల జాబితా అందర్నీ ఆకర్షిస్తోంది.

ఈ జాబితాలో అమెరికన్ హాస్యనటుడు జెర్రీ సీన్‌ఫెల్డ్ టాప్ ప్లేస్‌లో నిలిచారు. ఆయన సంపద సుమారు $1 బిలియన్ అంటే రూ. 8,300 కోట్లు. టెలివిజన్ సిట్‌కామ్ “Seinfeld” ఆయనకు అపారమైన ప్రజాదరణ, సంపద తెచ్చిపెట్టింది. ఆయన తర్వాత టైలర్ పెర్రీ కూడా అదే స్థాయిలో ($1 బిలియన్) రెండవ స్థానంలో ఉన్నారు.
తదుపరి స్థానాల్లో ప్రముఖ హాలీవుడ్ స్టార్లు నిలిచారు. ‘ది రాక్’ డ్వేన్ జాన్సన్ ($890 మిలియన్లు), షారుఖ్ ఖాన్ ($876.5 మిలియన్లు) మరియు టామ్ క్రూజ్ ($800 మిలియన్లు) వరుసగా మూడవ, నాల్గవ, ఐదవ స్థానాల్లో ఉన్నారు.
షారుఖ్ ఖాన్ బాలీవుడ్ నుంచీ ఈ జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ నటుడు కావడం గర్వకారణం. మొత్తం జాబితాలో 8 మందిలో 6 మంది అమెరికన్‌లు ఉండగా, ఒకరు భారతీయుడు (షారుఖ్) మరియు మరొకరు చైనా నటుడు జాకీ చాన్ ($520 మిలియన్లు) 10వ స్థానంలో ఉన్నారు. జార్జ్ క్లూనీ, రాబర్ట్ డి నీరో, బ్రాడ్ పిట్, టామ్ హాంక్స్ కూడా టాప్ టెన్‌లో ఉన్నారు.