జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడిచేసి భీకర కాల్పులు జరిపారు. ఈ దాడిలో మొత్తం 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా ఉన్నారు. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన మధుసూదన్ (నెల్లూరు జిల్లా) మరియు చంద్రమౌళి (విశాఖపట్నం) ఈ దాడిలో అమరులయ్యారు.

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ మంగళగిరిలో అమరులకి నివాళులు అర్పిస్తూ ప్రత్యేక సభ నిర్వహించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. మధుసూదన్ కుటుంబానికి పార్టీ తరఫున రూ. 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. “జనసేన ఎల్లప్పుడూ మీ కుటుంబానికి అండగా ఉంటుంది” అని భరోసా ఇచ్చారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ‘‘మనం లౌకిక దేశంగా అన్ని మతాలను గౌరవిస్తుంటే, పాకిస్తాన్ మాత్రం మతం అడిగి కాల్పులు జరిపే స్థితికి దిగజారడం దారుణం’’ అన్నారు. ఉగ్రవాదం మీద పోరాటం కొనసాగాలని, అమాయకుల రక్తం వృథా కాకూడదని ఆయన పేర్కొన్నారు.