• Home
  • Entertainment
  • శ్రీలీల గొప్ప మనసు: మరో చిన్నారిని ఇంటికి తీసుకొచ్చిన బిజీ హీరోయిన్…!!
Image

శ్రీలీల గొప్ప మనసు: మరో చిన్నారిని ఇంటికి తీసుకొచ్చిన బిజీ హీరోయిన్…!!

టాలీవుడ్‌లో ఇప్పుడు మోస్ట్ బిజీ హీరోయిన్‌గా మారింది శ్రీలీల. జయాపజయాలతో సంబంధం లేకుండా తెలుగులోను, హిందీలోను వరుసగా సినిమాలు చేస్తోంది ఈ అందాల తార. సినిమాల విషయానికొస్తే పక్కన పెడితే, శ్రీలీల చిన్న వయసులోనే గొప్ప మనసు కనబరిచింది. 2022లో ఓ అనాథశ్రమ సందర్శనలో దివ్యాంగులు అయిన గురు, శోభిత అనే ఇద్దరు పిల్లలను చూసి చలించిపోయిన ఆమె, వారిని దత్తత తీసుకుని తల్లిగా తానే ఆలనా పాలనా చూసుకుంటోంది. ఇది సాధారణంగా పెళ్లి కాని అమ్మాయిలు చేయడానికి కాస్త వెనకడుగు వేస్తారు. కానీ శ్రీలీల గొప్ప మనసు చూపించి అందరినీ ఆకట్టుకుంది.

తాజాగా మరో పాపను తన ఇంటికి తీసుకువచ్చినట్లు ఆమె తెలిపింది. సోషల్ మీడియాలో చిన్నారికి ముద్దు పెడుతూ ఓ ఫోటోను పంచుకొని, “మా ఇంటికి మరొకరు వచ్చారు, మా హృదయాలను నింపేందుకు,” అంటూ ఎమోషనల్ కామెంట్ పెట్టింది. దీంతో నెటిజన్లు – ఈ పాప ఎవరు? మరో దత్తత తీసుకున్న పాపనా? లేక బంధువుల పిల్లనా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలా మంది శ్రీలీల మరో పాపను దత్తత తీసుకుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. దీనిపై శ్రీలీల అధికారికంగా క్లారిటీ ఇస్తే తప్ప నిజం తెలియదు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శ్రీలీల మాస్ జాతర సినిమాలో రవితేజతో కలిసి నటిస్తోంది. ‘ధమాకా’ సక్సెస్ తర్వాత ఈ ఇద్దరూ మరోసారి జంటగా కనువిందు చేయనున్నారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ కథానాయికగా శ్రీలీల నటిస్తోంది. అలాగే హిందీలో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తోంది. ఇలా చేతి నిండా సినిమాలతో, గుండె నిండా మంచితనంతో శ్రీలీల మంచి పేరును సంపాదించుకుంటోంది.

https://www.instagram.com/p/DI8xJDVM8Bq/?utm_source=ig_web_copy_link

Releated Posts

ఈడీ నోటీసులు.. మహేష్ బాబు విచారణకు హాజరవుతారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్,…

ByByVedika TeamMay 12, 2025

విజయ్ కుమారుడు.. అఖిల్‌తో కలిసిన ఫోటో వైరల్! భారీ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు…!!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే…

ByByVedika TeamMay 10, 2025

సమంత “న్యూ బిగినింగ్స్” ఫొటోల వెనుక రహస్యం: రాజ్‌ నిడిమోరుతో సంబంధం?

సమంత ఇటీవల “న్యూ బిగినింగ్స్” అనే క్యాప్షన్‌తో పలు ఫొటోలు షేర్ చేయగా, అందులో దర్శకుడు రాజ్‌ నిడిమోరు కనిపించడంతో నెటిజన్ల దృష్టి అక్కడికి…

ByByVedika TeamMay 9, 2025

రజనీకాంత్ ‘కూలీ’ పారితోషికం షాకింగ్: 260 కోట్లు రెమ్యునరేషన్.. నాగార్జున, ఆమిర్ ఖాన్‌కి ఎంతంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్…

ByByVedika TeamMay 8, 2025

Leave a Reply