• Home
  • Entertainment
  • టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న మీనాక్షి చౌదరి – చిన్నప్పుడు హైట్‌తో ఎదురైన సమస్యపై ఆమె భావోద్వేగాలు!
Image

టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న మీనాక్షి చౌదరి – చిన్నప్పుడు హైట్‌తో ఎదురైన సమస్యపై ఆమె భావోద్వేగాలు!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక పేరు దుమ్మురేపుతోంది – మీనాక్షి చౌదరి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ అందాల భామ, బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో తన కెరీర్‌ను పటిష్ఠం చేసుకుంటోంది. తక్కువ సమయంలోనే కుర్రాళ్లను తన అందంతో ఆకట్టుకుని, భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

తాజాగా మీనాక్షి మాట్లాడుతూ, తన ఎత్తు చిన్నప్పుడు సమస్యగా అనిపించేదని, దానితో బాధపడేదని తెలిపింది. అప్పట్లో తన సమస్యను తన తండ్రి, ఆర్మీ ఆఫీసర్‌కు చెప్పగా, “నీ సమస్యను నువ్వే ఓ ఛాలెంజ్‌లా తీసుకోవాలి” అని సలహా ఇచ్చారట. ఆ మాటలతో ప్రేరణ పొందిన మీనాక్షి, అందాల పోటీల్లో పాల్గొని, ఇండస్ట్రీలోకి ప్రవేశించి, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.
మీనాక్షి చౌదరి 2017లో ఇండియన్ మిలిటరీ అకాడమీ మిస్ IMA అవార్డు గెలుచుకుంది. 2019లో ‘అప్‌స్టార్ట్స్’ అనే హిందీ చిత్రంతో నటనా ప్రస్థానం ప్రారంభించింది. తెలుగు చిత్రంగా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ లో హీరోయిన్‌గా తెరపై కనిపించింది. ‘ఖిలాడి’, ‘హిట్: ది సెకండ్ కేస్’, ‘గుంటూరు కారం’, ‘లక్కీ భాస్కర్’, ‘మెకానిక్ రాకీ’, ‘మట్కా’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో బిజీగా ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేయడంతో వెంకటేష్ కెరీర్‌లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.
తాజాగా మీనాక్షి చేసిన వ్యాఖ్యలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Releated Posts

ఈడీ నోటీసులు.. మహేష్ బాబు విచారణకు హాజరవుతారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్,…

ByByVedika TeamMay 12, 2025

విజయ్ కుమారుడు.. అఖిల్‌తో కలిసిన ఫోటో వైరల్! భారీ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు…!!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే…

ByByVedika TeamMay 10, 2025

సమంత “న్యూ బిగినింగ్స్” ఫొటోల వెనుక రహస్యం: రాజ్‌ నిడిమోరుతో సంబంధం?

సమంత ఇటీవల “న్యూ బిగినింగ్స్” అనే క్యాప్షన్‌తో పలు ఫొటోలు షేర్ చేయగా, అందులో దర్శకుడు రాజ్‌ నిడిమోరు కనిపించడంతో నెటిజన్ల దృష్టి అక్కడికి…

ByByVedika TeamMay 9, 2025

రజనీకాంత్ ‘కూలీ’ పారితోషికం షాకింగ్: 260 కోట్లు రెమ్యునరేషన్.. నాగార్జున, ఆమిర్ ఖాన్‌కి ఎంతంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్…

ByByVedika TeamMay 8, 2025

Leave a Reply