• Home
  • Games
  • ఢిల్లీ గడ్డపై కోహ్లీ హవా..రాహుల్ సెలబ్రేషన్‌కు ఘాటు ప్రతిస్పందన..!!
Image

ఢిల్లీ గడ్డపై కోహ్లీ హవా..రాహుల్ సెలబ్రేషన్‌కు ఘాటు ప్రతిస్పందన..!!

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 162 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ జట్టు తడబడినప్పటికీ విరాట్ కోహ్లీ (51 పరుగులు) మరియు కృనాల్ పాండ్యా (73 పరుగులు) కలిసి నాల్గవ వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం చేస్తూ జట్టును గెలిపించారు.

ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ, క్రీజులో ఉన్న సమయంలో 4 ఫోర్లు బాదాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్‌ను ‘ఇది నా మైదానం’ అంటూ ఆటపట్టించాడు. గతంలో బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ఇదే సెలబ్రేషన్ చేశాడు. ఇప్పుడు కోహ్లీ ఢిల్లీలో అదే మాటతో సమాధానం ఇచ్చాడు.

ఈ విజయం ద్వారా ఆర్సీబీ 10 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానానికి ఎగబాకింది. కోహ్లీ ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు 443 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ పట్టుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో ఉన్నాడు.

ఈ క్రమంలో ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ రాహుల్‌కు ఇచ్చిన గట్టిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు కోహ్లీ మాస్ సెలబ్రేషన్‌కు ఫిదా అయిపోతున్నారు.

Releated Posts

విరాట్ కోహ్లి టెస్టులకు గుడ్‌బై – అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటన…

న్యూఢిల్లీ: భారత క్రికెట్ అభిమానులకు ఓ ఆవేదన కలిగించే వార్త. టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు.…

ByByVedika TeamMay 12, 2025

ఐపీఎల్ 2025కి బ్రేక్: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య BCCI కీలక నిర్ణయం…

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఐపీఎల్ 2025పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్…

ByByVedika TeamMay 9, 2025

రామ్ చరణ్ ‘పెద్ది’ క్రికెట్ షాట్‌ను రీ-క్రియేట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ – వీడియో వైరల్!

గేమ్ ఛేంజర్ సినిమాతో విమర్శలను ఎదుర్కొన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాతో మళ్ళీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు. బుచ్చిబాబు…

ByByVedika TeamMay 5, 2025

నమస్కారానికి తలవంచిన హిట్ మ్యాన్ – కోట్లల్లో దొరకని గౌరవం రోహిత్ శర్మ సొంతం!

ఐపీఎల్ 2025లో గురువారం జరిగిన ముంబయి ఇండియన్స్ vs రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ అనంతరం ఓ హృద్యమైన క్షణం అందరి మనసులు తాకింది. రాజస్తాన్…

ByByVedika TeamMay 2, 2025

Leave a Reply