మంచు విష్ణు “కన్నప్ప” సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ నటిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. న్యూజిలాండ్ అడవుల్లో, రామోజీ ఫిలిం సిటీలో సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇటీవల మీడియాతో మాట్లాడిన మంచు విష్ణు, ప్రభాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. “నా దృష్టిలో ప్రభాస్ నార్మల్ యాక్టర్ మాత్రమే. అతను ఇంకా లెజెండ్ కాలేదు. మోహన్ లాల్ లాంటి స్టార్స్ కాలంతో లెజెండ్స్‌గా మారారు. ప్రభాస్ కూడా భవిష్యత్తులో తప్పకుండా లెజెండ్ అవుతాడు” అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. “కన్నప్ప” సినిమా జూన్ 27న థియేటర్స్‌లో విడుదల కానుంది.