అందాల భామ సమంత మళ్లీ సినిమాలతో బిజీ అవ్వడానికి సిద్ధమవుతోంది. మాయోసైటిస్ వల్ల ఏడాది పాటు వెనక్కి తగ్గిన సామ్, ఇప్పుడు పూర్తిగా కోలుకుని పాన్ ఇండియా రేస్‌లోకి ఎంటర్ అయ్యింది. చివరిసారిగా ‘ఖుషి’ చిత్రంలో విజయ్ దేవరకొండతో నటించిన సమంత, ఆ తర్వాత బాలీవుడ్ సిరీస్ ‘సిటాడెల్ హనీ బన్నీ’లో మెరిసింది. ప్రస్తుతం ఆమె తమిళనాడులో జరిగిన గోల్డెన్ క్వీన్ అవార్డ్స్‌లో గోల్డెన్ క్వీన్ అవార్డు అందుకుంది.

ఈ వేడుకలో ఆమె దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గురించి చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన అనారోగ్య సమయంలో రాహుల్ తనతోనే ఉండి ఎంతో సాయపడాడని, తనకు ఆయన స్నేహితుడా, సోదరుడా, కుటుంబ సభ్యుడా ఏంటో తెలీదని చెప్పింది సమంత. ఆమె ఈ మాటలు వినిన అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఇప్పుడు సమంత మళ్లీ ఫుల్ ఫారంలోకి వస్తోంది.