ధనశ్రీ వర్మ… క్రికెటర్ చాహల్‌తో విడాకులు తర్వాత తన కెరీర్ పై మరింత దృష్టి పెట్టింది. డ్యాన్సర్, కొరియోగ్రాఫర్‌గా భారతదేశంలో ఎంతో మంది అభిమానులను సంపాదించిన ఆమె ఇప్పుడు టాలీవుడ్ తెరపై అడుగుపెట్టనుంది.

ప్రఖ్యాత నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో, ‘బలగం’ తర్వాత హర్షిత్, హన్షిత నిర్మిస్తున్న సినిమాలో ధనశ్రీ ముఖ్య పాత్ర పోషించనుంది. యష్ మాస్టర్ హీరోగా, మలయాళ నటి కార్తీక మురళీధరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి శశికుమార్ ముతులూరి దర్శకత్వం వహిస్తున్నారు.
ధనశ్రీకు భారతనాట్యం నుంచి మోడర్న్ డాన్స్ వరకు విశేషమైన నైపుణ్యం ఉంది. ఆమె ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటూ, ప్రాక్టీస్ వీడియోలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ముంబయిలో పుట్టిన ధనశ్రీ మొదట డెంటిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఆపై షియామాక్ దావర్ వద్ద శిక్షణ పొంది తనే స్వయంగా డ్యాన్స్ అకాడమీ స్థాపించింది.
ఇప్పుడు ఆమె నటిగా మన ముందుకు రాబోతుండటం ఆమె అభిమానులకు గర్వకారణంగా మారింది. ఈ సినిమా ద్వారా మరో స్టార్ డాన్సర్ హీరోయిన్ అవుతుందా చూడాలి!