అమరావతి, ఏప్రిల్ 25:
ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 23న విడుదలయ్యాయి. మొత్తం 6,14,459 మంది పరీక్షలు రాయగా, 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 81.14%. పార్వతీపురం మన్యం జిల్లా 93.90%తో అగ్రస్థానంలో నిలవగా, అల్లూరి సీతారామరాజు జిల్లా తక్కువ ఉత్తీర్ణత నమోదు చేసింది.

తక్కువ మార్కులు వచ్చిన లేదా పరీక్ష తప్పిన విద్యార్థుల కోసం రీ వెరిఫికేషన్ (రూ.1000), రీ కౌంటింగ్ (రూ.500) అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. దరఖాస్తుల గడువు మే 1 వరకు ఉండగా, స్కూల్ లాగిన్ ద్వారా వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.
ఫెయిలైన విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి మే 28 వరకు జరగనున్నాయి. టైమ్‌టేబుల్ ప్రకారం:
- మే 19 – ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 1
- మే 20 – సెకండ్ ల్యాంగ్వేజ్
- మే 21 – ఇంగ్లీష్
- మే 22 – గణితం
- మే 23 – భౌతిక శాస్త్రం
- మే 24 – జీవ శాస్త్రం
- మే 26 – సామాజిక శాస్త్రం
- మే 27 – ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 2, OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 1
- మే 28 – OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2, SSC వొకేషనల్ కోర్సు
ఫీజు చెల్లింపు ఏప్రిల్ 24 నుంచి 30 వరకు ఉండగా, ఆలస్య రుసుముతో జూన్ 18 వరకు అవకాశం ఉంది.
ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. పదో తరగతిలో 26,679 మంది రాసి 37.93% ఉత్తీర్ణత పొందగా, ఇంటర్‌లో 63,668 మంది రాసి 53.12% ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్ (రూ.200), రీ వెరిఫికేషన్ (రూ.1000) కోసం ఏప్రిల్ 26 నుంచి మే 5 వరకు AP Online ద్వారా అప్లై చేయవచ్చు.
ముఖ్యంగా, 2025 మేలో రెగ్యులర్ పదో తరగతి పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.