భారత్‌పై ఉగ్రదాడులకు పాక్ రంగం సిద్ధం చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఏకంగా 42 ఉగ్ర శిక్షణ శిబిరాలు వెలుగులోకి వచ్చాయి. ఇవి ఎల్‌ఓసీ సమీపంలో ఉండి, వందలమంది ముష్కరులు శిక్షణ పొందుతున్నారు. ఇటీవల పహల్గాం సమీపంలో అమర్నాథ్ యాత్ర ప్రాంతమైన బైసరన్‌లో జరిగిన దాడితో ఈ విషయం బహిర్గతమైంది.

భద్రతా సంస్థల నివేదికల ప్రకారం, పిఒకేలోని శిబిరాల్లో 115 నుంచి 130 మంది ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారు. వారిలో 115 మంది పాక్ జాతీయులు కాగా, 15 మంది స్థానికులు. ప్రస్తుతం కశ్మీర్ లోయలో 70-75 మంది, జమ్మూ-రాజౌరీ-పూంచ్ ప్రాంతాల్లో 60-65 మంది ఉగ్రవాదులు చురుకుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
జమ్మూ కశ్మీర్‌లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉండగా, వీరిలో 35 మంది లష్కరే తోయిబా, 18 మంది జైషే మహమ్మద్‌కు చెందినవారు. ఇదే సమయంలో అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి సిద్ధమవుతుండగా, ఉగ్రదాడి కలకలం రేపుతోంది.
భద్రతా బలగాలు చర్యలకు సన్నద్ధమవుతుండగా, భారత్ ప్రతీకార దాడికి సిద్ధమైంది. గతంలోలా సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ తరహాలో టార్గెట్‌డ్ ఆపరేషన్లు చేపట్టాలని యోచన. రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఇప్పటికే త్రివిధ దళాలు రెడీగా ఉన్నాయని ప్రకటించారు.
భారత్ ఇప్పటికే పాక్‌పై దౌత్యపరంగా కూడా దాడి ప్రారంభించింది. వీసాల రద్దు, హైకమిషనర్ల బహిష్కరణ వంటి చర్యలు చేపడుతోంది. అంతర్జాతీయ సమాజం ముందు పాక్ ఉగ్రవాదానికి పాల్పడుతున్న దేశంగా ముద్ర వేయించేందుకు భారత్ కృషి చేస్తోంది.