ఏప్రిల్‌లోనే మే నెల వేడి మొదలైపోయింది. నిన్నమొన్నటి వరకూ అకాల వర్షాలు కాస్త ఉపశమనం కలిగించగా, ఇప్పుడు మళ్లీ భానుడు నిప్పులు చెరిగిస్తున్నాడు. ఉదయం 9 గంటలకే ఎండలు భయంకరంగా మారుతున్నాయి. మధ్యాహ్నం అయితే మరింత వేడిగా మారి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లో తీవ్ర వేడి ఉంది. నిన్న ఆదిలాబాద్‌లో 44.3, నిజామాబాద్ 44 డిగ్రీలు నమోదు కాగా, రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఏపీలోనూ పరిస్థితి భయంకరంగా ఉంది. గోనవరంలో 44 డిగ్రీలు, కడపలో 43.6, కర్నూలులో 42.9 డిగ్రీల తాపం నమోదైంది. మొత్తం 135 ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా రికార్డయింది. వేడి గాలులు కూడా జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఎండల ప్రభావంతో ప్రజలు బయటకి రావాలంటేనే భయపడుతున్నారు.