బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ సభను వరంగల్‌లో బాహుబలి స్థాయిలో నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 27న ఎల్కతుర్తి దగ్గర జరగబోయే ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది కార్యకర్తలు హాజరవుతారని అంచనా. మొత్తం 1213 ఎకరాల్లో సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో 5 ఎకరాల్లో భారీ వేదిక, 150 ఎకరాల్లో VIP, మీడియా, ఉద్యమకారులకు గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. 4 ఎకరాలు VIP పార్కింగ్‌కి కేటాయించారు. పబ్లిక్ పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు, వాహనాల రాకపోకలకు ట్రాఫిక్ ప్లాన్ సిద్ధం చేశారు.

ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకుని 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, కూలర్లు అందుబాటులో ఉంచనున్నారు. సభ ఖర్చు కోసం పార్టీ ప్రతి నియోజకవర్గానికి రూ.25 లక్షల చెక్కులు విడుదల చేసింది. RTC బస్సులు, ప్రైవేట్ వాహనాల కోసం రూ.9 కోట్లు ఖర్చు చేశారు. వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, మీడియా ప్రచారానికి మరో రూ.25 కోట్ల ఖర్చు అంచనా. మొత్తం వ్యయం రూ.100 కోట్లు దాటే అవకాశముంది.

ఇది తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక భారీ రాజకీయ సమావేశంగా నిలవబోతోంది. ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసేలా ఈ బాహుబలి సభ BRS సత్తాను మరోసారి చాటనుంది.