అమరావతి, ఏప్రిల్ 22: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి విద్యార్థులకు ముఖ్య సమాచారం. 2025 మార్చిలో నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23), ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయారామరాజు అధికారికంగా ప్రకటించారు.
ఇందులో ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫలితాలు కూడా విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను ఆధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ఫలితాలు చూసేందుకు మిగతా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మనమిత్ర (WhatsApp) ద్వారా ఫలితాల కోసం 9552300009 నంబరుకు ‘Hi’ అని మెసేజ్ చేయాలి. అటుపై విద్యాసేవలు → SSC Results → హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు. అలాగే LEAP యాప్ ద్వారా కూడా ఫలితాలు చూసే సౌకర్యం ఉంటుంది.
పాఠశాలల ప్రిన్సిపల్స్ తమ లాగిన్ ద్వారా తమ స్కూల్ విద్యార్థుల ఫలితాల మేమోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షలు మార్చి 17 నుండి ఏప్రిల్ 1 వరకు నిర్వహించగా, మూల్యాంకనం ఏప్రిల్ 3 నుండి 9 వరకు జరిగింది. అలాగే సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్ పరీక్షలు మార్చి 17 నుండి 28 వరకు జరిగాయి.