• Home
  • Entertainment
  • అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ వీడియో వైరల్ – అభిమానుల ప్రార్థనలు…!!
Image

అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ వీడియో వైరల్ – అభిమానుల ప్రార్థనలు…!!

అషు రెడ్డి పేరు ఇప్పుడు తెలుగు ఆడియన్స్‌కి ప్రత్యేక పరిచయం అక్కర్లేని స్థాయిలో ఉంది. మొదట టిక్‌టాక్ మరియు డబ్‌స్మాష్ వీడియోలతో జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తన అందం, ఎనర్జీ, టాలెంట్‌తో బుల్లితెరపై మెరిసింది. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని మరింత పాపులర్ అయ్యింది. తరువాత కొన్ని సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం టీవీ షోలు, స్పెషల్ ప్రోగ్రామ్స్‌లో యాంకర్‌గా బిజీగా కొనసాగుతోంది.

ఇటీవల అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఎమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో ఆమె బ్రెయిన్ ట్రీట్మెంట్ కోసం డాక్టర్ల దగ్గర సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఆమె జుట్టు కత్తిరించడం, బ్రెయిన్ ట్రీట్మెంట్‌కు మానసికంగా ఎలా సిద్ధమయ్యిందన్న దృశ్యాలు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు ఆందోళనకు లోనయ్యారు. “అషుకు ఏమైంది?”, “ఎందుకిలా జరిగింది?” అంటూ కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ బ్రెయిన్ సర్జరీ ఇప్పుడు జరగలేదని, గతేడాది జరిగిన దాని వీడియోను ఇప్పుడు షేర్ చేశారని తెలుస్తోంది.

అషు రెడ్డి ఈ వీడియోను పంచుకుంటూ, “ఈ జీవితం చాలా చిన్నది. నా చుట్టూ ఉండి నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా కోలుకే ప్రార్థించిన వారందరికీ థ్యాంక్స్” అంటూ ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు. తన ఈ పోస్ట్‌కు ఆమె #brainsurgery #recovery #thankfultoeveryone #journeyoflife #thankgod వంటి హ్యాష్‌ట్యాగ్‌లు జోడించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు, సినీ పరిశ్రమ నుంచి పలువురు ఆమె త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బ్రెయిన్ సర్జరీ లాంటి గంభీరమైన అనుభవాన్ని ఆమె ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్న తీరు ప్రతి ఒక్కరినీ అభినందింపజేస్తోంది. అషు షేర్ చేసిన ఈ జీవితయానాన్ని చూసి ఎంతోమంది ప్రేరణ పొందుతున్నారు.

https://www.instagram.com/reel/DIs7Sw_p50L/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Releated Posts

ఈడీ నోటీసులు.. మహేష్ బాబు విచారణకు హాజరవుతారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్,…

ByByVedika TeamMay 12, 2025

విజయ్ కుమారుడు.. అఖిల్‌తో కలిసిన ఫోటో వైరల్! భారీ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు…!!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే…

ByByVedika TeamMay 10, 2025

సమంత “న్యూ బిగినింగ్స్” ఫొటోల వెనుక రహస్యం: రాజ్‌ నిడిమోరుతో సంబంధం?

సమంత ఇటీవల “న్యూ బిగినింగ్స్” అనే క్యాప్షన్‌తో పలు ఫొటోలు షేర్ చేయగా, అందులో దర్శకుడు రాజ్‌ నిడిమోరు కనిపించడంతో నెటిజన్ల దృష్టి అక్కడికి…

ByByVedika TeamMay 9, 2025

రజనీకాంత్ ‘కూలీ’ పారితోషికం షాకింగ్: 260 కోట్లు రెమ్యునరేషన్.. నాగార్జున, ఆమిర్ ఖాన్‌కి ఎంతంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్…

ByByVedika TeamMay 8, 2025

Leave a Reply