తెలుగు సినీపరిశ్రమలో ‘లవ్ స్టోరీ’ చిత్రాలతో పేరు తెచ్చుకున్న అక్కినేని సుమంత్, ఇప్పుడు మరోసారి ఓ భిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘అనగనగా’ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ETV Winలో మే 8 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ చిత్రానికి సన్నీ కుమార్ దర్శకత్వం వహించగా, కథానాయికగా కాజల్ చౌదరి నటించింది.

ఈ సినిమాలో సుమంత్ ఓ ప్రేరణాత్మక ఉపాధ్యాయుడి పాత్రలో కనిపించనున్నారు. టీజర్ ప్రకారం, విద్యా వ్యవస్థలోని లోపాలను చూపిస్తూ, పిల్లలపై మార్కుల ఒత్తిడి కాకుండా కాన్సెప్ట్ ను బోధించాలన్న సందేశంతో కథ ముందుకు సాగుతుంది. “అనగనగా” అనే టైటిల్‌తో చిన్నారులకు కథలుగా విద్యను అందించాలన్న మంచి ప్రయత్నంగా ఇది నిలవనుంది.

ఈ సినిమా కోసం ఈటీవీ విన్ “పరీక్షల ఒత్తిడి మీన్మీదా?” అంటూ ఒక సందేశాత్మక ప్రమోషన్ కూడా విడుదల చేసింది. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కూడా ఉపయోగపడే సందేశాలుతో కూడిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌కి స్ఫూర్తినిస్తుంది.