తెలుగు సినీ పరిశ్రమలో “ఏ మాయ చేశావే” సినిమాతో అడుగుపెట్టిన సమంత, తన నటనతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అనేక అవార్డులు అందుకున్న ఈ బ్యూటీ, నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే నాలుగు సంవత్సరాల తర్వాత వారిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. అప్పటి నుంచి సమంత వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

డివోర్స్, మయోసైటిస్ వంటి ఆరోగ్య సమస్యల తర్వాత, సమంత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండగా, తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తిరిగి బిజీ అయిపోయింది. ఇప్పటికి పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ, ‘ట్రలాలా’ అనే సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించింది.
ఈ సంస్థ ద్వారా “శుభం” అనే తొలి సినిమా మే 9న విడుదల కానుంది. ఈ సినిమా విజయంపై సమంత భారీగా ఆశలు పెట్టుకుంది. కొత్త ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, సమంత తిరుమల వెళ్లి ప్రత్యేక పూజలు కూడా చేసింది.

ప్రస్తుతం శుభం ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొంటున్న సమంత తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వైలెట్ కలర్ చుడీదార్లో ఉన్న సమంత లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇవే ఫొటోలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.
ఇక మరోవైపు, సమంత రాజ్ నిడియోరుతో ప్రేమలో ఉందన్న వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వీరి మధ్య వివాహం కూడా త్వరలో జరగొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పెళ్లి అనంతరం ఎలాంటి సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో సమంత ప్రత్యేక పూజలు చేసినట్టు కొన్ని రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి.