ప్రముఖ నటుడు మరియు ‘దసరా’ విలన్ షైన్ టామ్ చాకో ఇటీవల వార్తల్లో హాట్ టాపిక్ అయ్యారు. రెండు రోజులుగా హోటల్ నుంచి తప్పించుకుని పరారీలో ఉన్న షైన్‌ను, ఎట్టకేలకు ఈరోజు ఉదయం 10.15కు ఎర్నాకుళం నార్త్ పోలీసులు అరెస్ట్ చేశారు. షైన్ పోలీసులకు లొంగిపోవడంతో పాటు, పోలీసులు అతని ఫోన్‌ను సీజ్ చేసి కాల్ లాగ్స్, గూగుల్ పే లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు అన్ని ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

ఈ కేసులో షైన్‌పై NDPS చట్టంలోని సెక్షన్ 27, 29(1) కింద కేసు నమోదైంది. ఈ సెక్షన్ల ప్రకారం అతనికి బెయిల్ రావడం అసాధ్యం. గరిష్ఠంగా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. డాన్సాఫ్ హోటల్‌లో డ్రగ్ డీలర్ సజీర్‌ను షైన్ స్వయంగా తెలుసునని చెప్పిన ప్రకటన, అతను నిందితులకు ఆర్థికంగా సహాయం చేసిన ఆధారాలు కీలకంగా మారాయి.
విచారణలో షైన్ మాట్లాడుతూ, హోటల్‌లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేయడంతో భయపడి పారిపోయానని తెలిపారు. తాను తమిళనాడుకు వెళ్లానని చెప్పిన షైన్, హోటల్‌లో పోలీసులు వచ్చారని తనకు తెలియదని వాదించారు. అయితే ఈ దాడుల వెనుక ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, అందుకే తనకు శత్రువులు పెరిగారని కూడా పేర్కొన్నారు. ఈ కేసు విచారణను ముగ్గురు ACPలు పర్యవేక్షిస్తున్నారు. meanwhile, మంత్రి సాజి చెరియన్ స్పందిస్తూ తప్పు చేసిన ఏవ్వరైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.