‘పుష్ప 2’తో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు తన తదుపరి చిత్రంపై దృష్టి సారించాడు. ఈ సినిమాలో బన్నీకి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కనిపించబోతున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని హిట్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్నారు. ‘జవాన్’తో బాలీవుడ్‌లో హవా చూపించిన అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయడం సినిమాపై అంచనాలను పెంచుతోంది.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఈ సినిమాలో మూడు పాత్రల్లో కనిపించనున్నాడట. అంటే ఇది త్రిపాత్రాభినయం. అల్లు అర్జున్ కెరీర్‌లో ఇది ఫస్ట్ టైం. దీంతో సినిమాపై క్రేజ్ మామూలుగా లేదు. దీనికి తగినట్టుగానే కథానాయికలుగా కూడా భారీ పేర్లు వినిపిస్తున్నాయి.
మొదట ప్రియాంక చోప్రా పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత జాన్వీ కపూర్, దిశా పటానీల పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఈ సినిమాకు ఎంపికవుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై నేషనల్ లెవెల్‌లో హైప్ పెరిగింది. అధికారికంగా కథానాయికల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.