• Home
  • Entertainment
  • మెగాస్టార్ నుంచి మెగా ట్రీట్: విశ్వంభర నుంచి ‘రామ రామ’ సాంగ్ రిలీజ్!
Image

మెగాస్టార్ నుంచి మెగా ట్రీట్: విశ్వంభర నుంచి ‘రామ రామ’ సాంగ్ రిలీజ్!

హనుమాన్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి “విశ్వంభర” మూవీ టీమ్ అభిమానులకు ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చింది. ఈ సందర్భంగా “రామ.. రామ..” అనే పవర్‌ఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాట విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. పాటలో హనుమంతుడి భక్తి, వైభవం, శ్రీరాముడి మహిమలను అత్యద్భుతంగా వివరించారు. చిరంజీవి వాయిస్‌లో వినిపించే “జై శ్రీరామ్” చాంత్రాణంగా నిలుస్తోంది.

బింబిసార ఫేమ్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న “విశ్వంభర” చిత్రం సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో చిరంజీవి హనుమంతుడికి అంకితభావంతో ఉన్న భక్తుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ మెగా ఫ్యాన్స్‌లో అంచనాలను పెంచగా, ఈ పాట విడుదల మరింత హైప్ తీసుకొచ్చింది.

ఈ పాటలో రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్, ఎంఎం కీరవాణి సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. “రాములోరి గొప్ప చెప్పుకుందామా.. సాములోరి పక్కన ఉన్న సీతమ్మ లక్షణాలు చెప్పుకుందామా..” లాంటి లైన్స్ వినసొంపుగా ఉన్నాయి. పాటను చూసిన ప్రేక్షకులు, అభిమానులు సోషల్ మీడియాలో ఈ పాటను మెచ్చుకుంటూ పండుగలా సెలబ్రేట్ చేస్తున్నారు.

Releated Posts

ఈడీ నోటీసులు.. మహేష్ బాబు విచారణకు హాజరవుతారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్,…

ByByVedika TeamMay 12, 2025

విజయ్ కుమారుడు.. అఖిల్‌తో కలిసిన ఫోటో వైరల్! భారీ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు…!!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే…

ByByVedika TeamMay 10, 2025

సమంత “న్యూ బిగినింగ్స్” ఫొటోల వెనుక రహస్యం: రాజ్‌ నిడిమోరుతో సంబంధం?

సమంత ఇటీవల “న్యూ బిగినింగ్స్” అనే క్యాప్షన్‌తో పలు ఫొటోలు షేర్ చేయగా, అందులో దర్శకుడు రాజ్‌ నిడిమోరు కనిపించడంతో నెటిజన్ల దృష్టి అక్కడికి…

ByByVedika TeamMay 9, 2025

రజనీకాంత్ ‘కూలీ’ పారితోషికం షాకింగ్: 260 కోట్లు రెమ్యునరేషన్.. నాగార్జున, ఆమిర్ ఖాన్‌కి ఎంతంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్…

ByByVedika TeamMay 8, 2025

Leave a Reply