సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు బ్రోన్కో స్కోపీ అనే వైద్యం అందించబడింది. ఈ ట్రీట్‌మెంట్ ఖర్చు లక్షల్లో ఉంటుందని అంతా భావించినప్పటికీ, వైద్యుల వివరాల ప్రకారం ఇది కేవలం రూ.4,000 నుంచి రూ.30,000 మధ్యే ఉండే చికిత్స అని తెలుస్తోంది.

ప్రమాద సమయంలో మార్క్ శంకర్ నల్లటి పొగ పీల్చడంతో ఊపిరితిత్తులలోకి గాలి శుద్ధి అవసరమైంది. బ్రోన్కో స్కోపీ ట్రీట్‌మెంట్ ద్వారా శ్వాసనాళాల్లోకి చేరిన విషవాయువులను తొలగించి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తారు. ఈ ట్రీట్‌మెంట్ ప్రమాదం జరిగిన 30 నిమిషాల్లోపు చేయాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

ప్రమాదం తెలియగానే పవన్ కళ్యాణ్ వెంటనే సింగపూర్ వెళ్లి తన కుమారుడిని పరామర్శించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన్ను కలిసేందుకు అక్కడికి వెళ్లారు. మార్క్ ఆరోగ్యం మెరుగుపడుతున్నప్పటికీ, హైదరాబాద్‌కి తీసుకొచ్చేందుకు ఇంకా రెండు మూడు రోజులు పడే అవకాశం ఉంది.