• Home
  • Andhra Pradesh
  • ఏపీ ఇంటర్ ఫలితాలపై పూర్తి సమాచారం – వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా ఫలితాలు…!!
Image

ఏపీ ఇంటర్ ఫలితాలపై పూర్తి సమాచారం – వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా ఫలితాలు…!!

అమరావతి, ఏప్రిల్ 12:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ మరియు సెకండ్ ఇయర్ ఫలితాలను ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 10.5 లక్షలమందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాయగా, ఎప్పటిలాగే ఈసారి కూడా అమ్మాయిలే టాప్ ర్యాంకులను సాధించి మెరుపులు మెరిపించారు.

విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు, ప్రభుత్వం ప్రారంభించిన మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు ‘hi’ అని మెసేజ్ పంపితే కూడా ఫలితాలు సులభంగా తెలుసుకోవచ్చు.

ఈ ఏడాది మార్చి 1 నుంచి 20 వరకు 26 జిల్లాల్లో 1535 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. పరీక్షలు పూర్తైన 20 రోజుల్లోనే మూల్యాంకనం పూర్తిచేసిన అధికారులు, గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఏప్రిల్ 12న ఫలితాలను విడుదల చేశారు.

విద్యార్థులకు సందేహాల నివృత్తి కోసం బోర్డు టోల్ ఫ్రీ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడీలను ప్రకటించనుంది. అలాగే, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం తేదీలను, సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఈ రోజే వెల్లడించనున్నారు.

Releated Posts

విశాఖ జీవీఎంసీ పీఠంపై కూటమి జెండా: 74 ఓట్లతో అవిశ్వాసం విజయం..!!

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC)లో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. అధికార కూటమి పక్కా వ్యూహంతో ముందుకెళ్లి, మేయర్ హరి వెంకట కుమారిపై…

ByByVedika TeamApr 19, 2025

ఇంజినీరింగ్ పాఠ్యాంశాలు ఇప్పుడు మాతృభాషలో: AICTE కీలక ప్రణాళిక..

ఏప్రిల్ 18: భారతీయ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇంతకు ముందు ఎంబీబీఎస్‌ పాఠ్యాంశాలను స్థానిక భాషల్లో ప్రవేశపెట్టిన కేంద్రం,…

ByByVedika TeamApr 18, 2025

ఏపీ లిక్కర్ స్కాం కేసు – సిట్ విచారణకు విజయసాయిరెడ్డి…!!

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో విచారణ వేగం పుంజుకుంది. ముఖ్యంగా రాజకీయంగా ప్రభావవంతమైన నేతలపై దృష్టి సారించిన సిట్ అధికారులు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని…

ByByVedika TeamApr 18, 2025

వైజాగ్‌లో డీఎస్పీ లైవ్ కాన్సెర్ట్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు!

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (DSP) తన ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్, బెంగుళూరు తర్వాత విశాఖపట్నం లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ప్లాన్ చేశారు.…

ByByVedika TeamApr 17, 2025

Leave a Reply