• Home
  • health
  • వేసవిలో మామిడి షేక్ తాగితే ఏమవుతుంది? – నిపుణుల మాటల్లో లాభాలు, నష్టాలు!

వేసవిలో మామిడి షేక్ తాగితే ఏమవుతుంది? – నిపుణుల మాటల్లో లాభాలు, నష్టాలు!

మామిడి పండు వేసవిలో అందరికీ ఎంతో ఇష్టమైనది. దీనిని పండుగా, పచ్చిగా, ఉడికించి తింటారు. అంతేకాదు, మామిడితో పలు రుచికరమైన పానీయాలు తయారవుతాయి. వాటిలో మామిడి షేక్ ప్రత్యేకం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టంగా తాగుతారు. పాలతో కలిపి చేసిన మామిడి షేక్ వేసవిలో శరీరానికి చల్లదనాన్ని, శక్తిని ఇస్తుంది.

మామిడిలో విటమిన్ A, C, E, K, B6, ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, జీర్ణక్రియకు సహాయపడతాయి. మామిడి షేక్ వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు కూడా ఇది సహకరిస్తుంది. వేసవిలో ఎక్కువ వేడి కారణంగా అలసట వస్తే మామిడి షేక్ తాగితే తక్షణ శక్తిని పొందొచ్చు.

అయితే దీన్ని ఎక్కువగా తీసుకుంటే హానికరం కావచ్చు. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారు మామిడి షేక్‌ను తాగకుండా ఉండాలి, లేదా పరిమితంగా తాగాలి. ఇందులో సహజంగానే చక్కెర అధికంగా ఉండటంతో రక్తంలో షుగర్ స్థాయిలు పెరగవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు కూడా తక్కువగా తీసుకోవాలి. మామిడి షేక్‌కు ఎక్కువగా చక్కెర కలిపితే ఇది మరింత హానికరం అవుతుంది.

ఢిల్లీ శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ డైటీషియన్ ప్రియా పాలివాల్ మాట్లాడుతూ.. రోజుకు ఒక్కసారి చిన్న గ్లాసులో మాత్రమే తాగాలని సూచిస్తున్నారు. గ్యాస్, అసిడిటీ, కాలేయ సంబంధిత సమస్యలున్న వారు డాక్టర్ సలహాతో మాత్రమే మామిడి షేక్ తాగాలి.

అంతిమంగా, మామిడి షేక్ ఆరోగ్యానికి మంచిదే కానీ మితంగా తీసుకుంటేనే మేలు చేస్తుంది. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, అవసరమైన పరిమితిలో మాత్రమే తీసుకోవడం ఉత్తమం.

Releated Posts

“మెదడు శక్తి పెంచే బ్రేక్‌ఫాస్ట్ ఫుడ్స్ – ప్రతిరోజూ తీసుకోవాల్సిన 10 ఆహారాలు”

మన శరీరానికి శక్తినిచ్చే ఆహారం ఎంత ముఖ్యమో, మన మెదడుకూ సరైన పోషకాలు అందించడం అంతకంటే అవసరం. మన ఆలోచనశక్తి, జ్ఞాపకశక్తి, మనోస్థితి అన్నీ…

ByByVedika TeamApr 19, 2025

కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా? స్క్రీన్ టైమ్ ప్రభావం & ఆరోగ్యకరమైన ఆహారం…

ఈ కాలంలో టీవీ, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్లు ఎక్కువగా చూసే అలవాటు వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటోంది. శరీరంలో అత్యంత సున్నితమైన అవయవం కనుక…

ByByVedika TeamApr 18, 2025

ప్లాస్టిక్ కంటైనర్లలో వేడి ఆహారాలు నిల్వ చేయడం హానికరం – ఆరోగ్య నిపుణుల సూచనలు…!!

పర్యావరణవేత్తలు ప్లాస్టిక్‌ను నిషేధించాలని పిలుపునిచ్చినా, ఇళ్లలో వీటి వాడకం అడ్డుకట్ట పడటం లేదు. ముఖ్యంగా వేడి ఆహార పదార్థాల కోసం ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించడం…

ByByVedika TeamApr 17, 2025

వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ చేసే పండ్లు – ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినవలసినవే!

వేసవి అంటే ఉక్కపోత, అధిక వేడి, నీరసం, చెమటలు. ఈ కాలంలో శరీరంలోని తేమ త్వరగా కోల్పోవడంతో డీహైడ్రేషన్, బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి.…

ByByVedika TeamApr 14, 2025

Leave a Reply