మెగాస్టార్ చిరంజీవి నటించిన “బావగారు బాగున్నారా” సినిమాలోని ఓ ప్రసిద్ధ సీన్‌ను ఇటీవల ఓ టీవీ షోలో యాంకర్ రవి, సుడిగాలి సుదీర్ రీక్రియేట్ చేశారు. ఈ సీన్‌లో చిరంజీవి నంది కొమ్ముల మధ్యగా చూస్తే రంభ కనిపిస్తుంది. అదే విధంగా టీవీ స్కిట్‌లో సుధీర్ చూస్తున్నపుడు రంభ పాత్రను రీక్రియేట్ చేశారు. అయితే, ఈ స్కిట్ హిందూ సెంటిమెంట్లను దెబ్బతీసిందంటూ రాష్ట్రీయ వానర సేన వంటి హిందూ సంస్థలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి.

హిందూ సంస్కృతి, గోమాతపై కామెడీ చేయడం అనుచితమని పేర్కొంటూ యాంకర్ రవికి వార్నింగ్‌లు ఇచ్చారు. షో నిర్వాహకులు, యాంకర్ రవి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో యాంకర్ రవి ఓ వీడియో ద్వారా స్పందించారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదని, ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.