ఐపీఎల్ 2025 సీజన్‌లో అజేయంగా దూసుకెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాకింగ్ న్యూస్ వచ్చింది. అక్షర్ పటేల్ నాయకత్వంలో మూడు మ్యాచ్‌లు ఆడి మూడింటిలోనూ గెలిచిన ఢిల్లీ జట్టు, ఇప్పుడు ఆర్సీబీతో జరగబోయే కీలక పోరుకు సిద్ధమవుతోంది. అయితే, ముఖ్యమైన ఈ మ్యాచ్‌కు ఢిల్లీ ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ అందుబాటులో లేకపోవచ్చనే వార్తలతో అభిమానులు కాస్త ఆందోళనలో పడుతున్నారు.

గత సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్న డుప్లెసిస్‌ను ఈసారి ఫ్రాంచైజీ విడుదల చేయగా, ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కొనుగోలు చేసింది. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లో 79 పరుగులు చేసి మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అయితే, ఇటీవల జరిగిన మ్యాచ్‌లో ఆయన ఆడలేదు.
ఈ నేపథ్యంలో అసిస్టెంట్ కోచ్ మాథ్యూ మోట్ మాట్లాడుతూ – “ఫాఫ్ ఫిట్‌నెస్ గురించి స్పష్టత రాలేదు. ఆర్సీబీ మ్యాచ్‌కు ముందు నెట్ సెషన్‌లో అతని స్థితిని అంచనా వేస్తాం. తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు.
ఈ పరిణామాలు నేపథ్యంలో ఢిల్లీ జట్టు ఫాఫ్ లేకుండానే బరిలో దిగుతుందా? లేక చివరి నిమిషంలో అతను జట్టులోకి వస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది.