ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి కారణంగా అనేక మంది ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో అపోలో హాస్పిటల్స్ సోమవారం విడుదల చేసిన ‘హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025’ నివేదిక దేశ ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆసక్తికర వివరాలు అందించింది. “లక్షణాల కోసం వేచిచూడకండి, ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా మార్చుకోండి” అనే సందేశంతో ఈ ఐదవ ఎడిషన్‌ను విడుదల చేశారు.

దేశవ్యాప్తంగా 25 లక్షలమందిపైగా ఆరోగ్య పరీక్షలు ఆధారంగా రూపొందిన ఈ నివేదికలో ‘నిశబ్ధ మహమ్మారి’గా పేర్కొంటూ – లక్షణాలు లేకుండానే లక్షలాది మంది ప్రజలు వ్యాధులతో బాధపడుతున్నట్లు వెల్లడించారు.
- 26% మందికి రక్తపోటు
- 23% మందికి మధుమేహం
- 66% మందికి కొవ్వు కాలేయం
- వీరిలో 85% మందికి మద్యపానం అలవాటు లేని వారే
అయినప్పటికీ వారిలో వ్యాధుల లక్షణాలు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణలో ప్రత్యేకంగా చూస్తే:
- 44,448 మందికి పరీక్షలు
- 10,427 మందికి అధిక రక్తపోటు
- 24,246 మందికి ప్రీహైపర్‌టెన్షన్
- 10,355 మందికి మధుమేహం
- 14,000 మందికి మధుమేహం వచ్చే సూచనలు
- 63% మందికి ఊబకాయం, 19% మందికి అధిక బరువు
- 47% మందికి డిస్‌లిపిడెమియా
- 3% మందికి మానసిక సమస్యలు (డిప్రెషన్, వ్యాకులత)
కాలేయ సమస్యలు:
- 32,333 మందిలో 49% మంది గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్
- 5% మందికి గ్రేడ్ 2
- 80 మందికి గ్రేడ్ 3
- 6 మందికి గ్రేడ్ 4
- 82% మందికి విటమిన్ డి లోపం
ఈ నివేదిక ఆధారంగా ప్రజలు ఆరోగ్యంపై మరింత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.