ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అంటే రన్ మేళం. ప్రతి సీజన్‌లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు కనువిందు చేస్తుంటాయి. ఐపీఎల్ చరిత్రలో ఎన్నో వేగవంతమైన సెంచరీలు నమోదయ్యాయి. అయితే ఇప్పటివరకు అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్.

2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున పుణే వారియర్స్‌పై గేల్ కేవలం 30 బంతుల్లో సెంచరీ చేశాడు. అదే మ్యాచ్‌లో 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇది ఐపీఎల్ మాత్రమే కాదు, టీ20 చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచింది.
గేల్ తర్వాత లిస్టులో ఉంది యూసుఫ్ పఠాన్ పేరు. 2010లో రాజస్థాన్ రాయల్స్ తరపున ముంబై ఇండియన్స్‌పై కేవలం 37 బంతుల్లో సెంచరీ చేసి అప్పట్లో భారత బ్యాట్స్‌మన్‌గా వేగవంతమైన సెంచరీ చేశాడు.
తాజాగా ప్రీతి జింటా జట్టైన పంజాబ్ కింగ్స్‌కు చెందిన ప్రియాంష్ ఆర్య, చెన్నై సూపర్ కింగ్స్‌పై 39 బంతుల్లో సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. ప్రియాంష్ ఈ ఘనత సాధించిన రెండవ భారతీయుడిగా రికార్డులకెక్కాడు.
ఇతర వేగవంతమైన సెంచరీల జాబితాలో ట్రావిస్ హెడ్ మరియు విల్ జాక్స్ వంటి విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు.