• Home
  • Andhra Pradesh
  • కియా పరిశ్రమలో భారీ చోరీ: 900 కారు ఇంజిన్లు మాయం…!!
Image

కియా పరిశ్రమలో భారీ చోరీ: 900 కారు ఇంజిన్లు మాయం…!!

శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలోని యర్రమంచి పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన కియా పరిశ్రమలో సంచలనాత్మక చోరీ వెలుగులోకి వచ్చింది. పరిశ్రమలో ఉంచిన సుమారు 900 కారు ఇంజిన్లు అదృశ్యమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

కియా యాజమాన్యం మార్చి 19న పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాతే ఈ విషయం బయటకు వచ్చింది. కేసు తీవ్రతను బట్టి పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును విచారిస్తోంది.

కియా సంస్థకు అవసరమైన విడిభాగాలు వివిధ ప్రాంతాల నుండి సరఫరా అవుతుంటాయి. ఇందులో భాగంగా, కారు ఇంజిన్లు ప్రధానంగా తమిళనాడు నుండి కంటైనర్ల ద్వారా వస్తాయి. ఈ ట్రాన్స్‌పోర్ట్ ప్రక్రియలో ఎక్కడైనా చోరీ జరిగిందా? లేదా పరిశ్రమకు వచ్చాకే ఈ దొంగతనమా? అనే కోణాల్లో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసు ప్రస్తుతం తుదిదశకు చేరిందని సమాచారం. త్వరలోనే పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది.

Releated Posts

ఇంజినీరింగ్ పాఠ్యాంశాలు ఇప్పుడు మాతృభాషలో: AICTE కీలక ప్రణాళిక..

ఏప్రిల్ 18: భారతీయ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇంతకు ముందు ఎంబీబీఎస్‌ పాఠ్యాంశాలను స్థానిక భాషల్లో ప్రవేశపెట్టిన కేంద్రం,…

ByByVedika TeamApr 18, 2025

ఏపీ లిక్కర్ స్కాం కేసు – సిట్ విచారణకు విజయసాయిరెడ్డి…!!

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో విచారణ వేగం పుంజుకుంది. ముఖ్యంగా రాజకీయంగా ప్రభావవంతమైన నేతలపై దృష్టి సారించిన సిట్ అధికారులు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని…

ByByVedika TeamApr 18, 2025

వైజాగ్‌లో డీఎస్పీ లైవ్ కాన్సెర్ట్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు!

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (DSP) తన ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్, బెంగుళూరు తర్వాత విశాఖపట్నం లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ప్లాన్ చేశారు.…

ByByVedika TeamApr 17, 2025

జేఈఈ మెయిన్ 2025 తుది ఫలితాలు ఇవాళ విడుదల – ర్యాంకులు, కటాఫ్‌ వివరాలు ఇదిగో…!!

హైదరాబాద్, ఏప్రిల్ 17:జేఈఈ మెయిన్ 2025 తుది విడత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ రోజు (ఏప్రిల్ 17) విడుదల చేయనుంది.…

ByByVedika TeamApr 17, 2025

Leave a Reply