ఇప్పటికే నిత్యావసరాల ధరలతో నలిగిపోతున్న సామాన్యుడిపై మరోసారి భారం మోపింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా వంటగ్యాస్ ధరలను పెంచింది. చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకారం, వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచినట్లు ప్రకటించారు. ఈ పెంపుతో పేద మరియు మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ కొత్త ధరలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి. 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.500 నుంచి రూ.550కు పెరిగింది. ఇక ఇతరులకు ధర రూ.853గా ఉంటుందని మంత్రి తెలిపారు.
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపదని ఆయన స్పష్టం చేశారు. అలాగే, ఈ ధరల పెంపు వల్ల చమురు మార్కెటింగ్ సంస్థలు ఎదుర్కొన్న రూ.43,000 కోట్ల నష్టాన్ని భర్తీ చేయడంలో ఇది తోడ్పడుతుందని వివరించారు.