దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో, ఈ ఇంధనాలపై ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ.2 చొప్పున పెంచింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 7 అర్ధరాత్రి 12 గంటల నుండి అమల్లోకి రానుంది.

ఈ నిర్ణయంతో వాహనదారులకు గట్టి షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ పై ధరల పెంపుతో ప్రజలపై మళ్లీ ఆర్థిక భారం పడనుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల ప్రభావంతోనూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ ఎక్సైజ్ సుంకం పెంపు నేరుగా వినియోగదారుడిపై భారం కాదని కేంద్రం స్పష్టంగా చెప్పింది. కానీ, ఇంధన ధరలపై ఇది ప్రభావం చూపుతుందా లేదా అనేది చమురు కంపెనీల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు $63.34 వద్ద ఉంది, ఇది గతంలో కంటే 15% తక్కువ.
అయితే, ఇంధన సరఫరా సంస్థల లాభాలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకునే ఉద్దేశంతో ఎక్సైజ్ సుంకాన్ని పెంచినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో మార్చి 15న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్, డీజిల్ పై రూ.2 తగ్గించారు. అప్పటి నుండి ఢిల్లీలో ధరలు రూ.100 కంటే తక్కువగా ఉండగా, చెన్నై, ముంబై, కోల్‌కతాల్లో మాత్రం రూ.100కుపైగా ఉన్నాయి.
ఇప్పుడు చమురు సంస్థలు కొత్త ఎక్సైజ్ డ్యూటీని ధరల్లోకి చేర్చుతాయా? లేకపోతే ప్రస్తుత ధరలకే సరఫరా చేస్తాయా అనేది చూడాల్సి ఉంది.