టిక్ టాక్ వీడియోలు, రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో పాపులారిటీ పొందిన అషు రెడ్డి, ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అమెరికాలో లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి, ఇప్పుడు బుల్లితెరపై బిజీగా మారింది.

మొదట కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి, ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపు పొందింది. తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ గురించి చాలా మందికి ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలియకపోవచ్చు. ఆమె తెలుగులో ఓ సినిమా చేసింది అన్న విషయం బిగ్ బాస్ కంటే ముందు.
విశాఖపట్నం కు చెందిన అషు రెడ్డి, MBAలో HR మేనేజ్మెంట్ పూర్తి చేసింది. ఆ తర్వాత అమెరికాలో ఉద్యోగం చేసి, లక్షల్లో జీతం పొందింది. ఉద్యోగం చేస్తూనే టిక్ టాక్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది.

అప్పుడు ఆమెకు పవన్ కళ్యాణ్ నిర్మాతగా, నితిన్ హీరోగా నటించిన “ఛల్ మోహన్ రంగ” సినిమాలో అవకాశం వచ్చింది. అమెరికాలోనే షూటింగ్ జరగడంతో, ఆ సినిమాలో నటించానని అషు చెబుతుంది. అదే సమయంలో ఆమెకు ఇండస్ట్రీపై మక్కువ పెరిగి, ఉద్యోగాన్ని వదిలేసి ఇండియాకు తిరిగొచ్చింది.
2018లో విడుదలైన “ఛల్ మోహన్ రంగ” సినిమాలో ఆమె అమెరికాలో ఉండే సన్నివేశాల్లో హీరోయిన్ ఫ్యామిలీ మెంబర్‌గా కనిపిస్తుంది. ఆ సినిమా తర్వాత 2019లో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది.
ప్రస్తుతం అషు రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తోంది. అలాగే బుల్లితెరపై పలు రియాల్టీ షోల్లో పాల్గొంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది.