• Home
  • Entertainment
  • ఎన్టీఆర్: కామెడీ తీయడం సులువు కాదు.. అందుకే ‘అదుర్స్ 2’ ఆగిపోయింది!
Image

ఎన్టీఆర్: కామెడీ తీయడం సులువు కాదు.. అందుకే ‘అదుర్స్ 2’ ఆగిపోయింది!

ఇటీవల ‘దేవర’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రస్తుతం భారీ అంచనాల మధ్య రూపొందుతున్న *’వార్ 2’*లో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు. పాన్ ఇండియా మూవీ లవర్స్ ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఇటీవల థియేటర్లలో నిరీక్షణ లేకుండా విడుదలై సూపర్ హిట్ సాధించిన చిత్రాల్లో మ్యాడ్ స్క్వైర్’ ఒకటి. యంగ్ హీరోస్ నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ మ్యాడ్కి ఇది సీక్వెల్. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై ఘనవిజయం సాధించింది.

ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో మ్యాడ్ స్క్వైర్ సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరై, సందడి చేశారు. ఆయన మ్యాడ్ టీం గురించి మాట్లాడుతూ, వారి ప్రతిభను ప్రశంసించారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ –

“నవ్వించడం ఒక గొప్ప వరం. మనల్ని నవ్వించేందుకు కళ్యాణ్ శంకర్ లాంటి దర్శకుడు దొరకడం అదృష్టం. ఈ సినిమాలో లడ్డు (విష్ణు) లేకపోతే హిట్ అయ్యేది కాదు. నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ కూడా అద్భుతంగా నటించారు. ‘దేవర’ సినిమాను అభిమానించి, భుజాలపై మోసినందుకు ధన్యవాదాలు. ‘దేవర 2’ ఉండదని అనుకునేవారికి చెబుతున్నా – ఆ సినిమా ఖచ్చితంగా వస్తుంది. మధ్యలో విరామం తీసుకున్నాం, ఎందుకంటే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ వచ్చింది. త్వరలో నాగవంశీతో మరో సినిమా చేయబోతున్నాం. ఆ సినిమాను స్టార్ట్ చేసిన వెంటనే ఫ్యాన్స్ అందరినీ హ్యాండిల్ చేయమని వదిలేస్తా,” అని పేర్కొన్నారు.

అలాగే అదుర్స్ 2 గురించి మాట్లాడుతూ –

“కామెడీ చేయడం ఒక్క యాక్టర్‌కి చాలా కష్టం. అందుకే అదుర్స్ 2 చేయాలనే ఆలోచనలో ఉన్నాను” అని ఎన్టీఆర్ తెలిపారు. గతంలో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదుర్స్ చిత్రం పెద్ద విజయం సాధించింది. అందుకే దీని సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. మొదటి భాగంలో నయనతార, షీలా హీరోయిన్లుగా నటించారు.

Releated Posts

విడాకుల బాటలో మరో జంట? నజ్రియా వ్యక్తిగత ఇబ్బందులతో ఆవేదన, సమంత స్పందన..!!

నజ్రియా నజీమ్.. మలయాళంలో ఈ చిన్నదానికి మంచి క్రేజ్ ఉంది. తెలుగులో మాత్రం ఒక్క సినిమాతోనే అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది. నేచురల్ స్టార్…

ByByVedika TeamApr 17, 2025

వైజాగ్‌లో డీఎస్పీ లైవ్ కాన్సెర్ట్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు!

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (DSP) తన ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్, బెంగుళూరు తర్వాత విశాఖపట్నం లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ప్లాన్ చేశారు.…

ByByVedika TeamApr 17, 2025

బన్నీ 3x పవర్ – అట్లీ డైరెక్షన్‌లో ట్రిపుల్ మాస్ ధమాకా!

‘పుష్ప 2’తో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు తన తదుపరి చిత్రంపై దృష్టి సారించాడు. ఈ సినిమాలో…

ByByVedika TeamApr 16, 2025

వెంకీ అట్లూరి-అజిత్ కాంబినేషన్‌లో కొత్త మూవీ… ఫ్యాన్స్ ఖుషీ!

టాలీవుడ్‌లో తనదైన శైలిలో విజయవంతంగా దూసుకెళ్తున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఇప్పుడు తమిళ స్టార్ అజిత్‌తో కలిసి సినిమా చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ‘సార్…

ByByVedika TeamApr 16, 2025

Leave a Reply