• Home
  • Andhra Pradesh
  • ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అగ్నిప్రమాదం: రెండో బ్లాక్‌లో మంటలు..
Image

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అగ్నిప్రమాదం: రెండో బ్లాక్‌లో మంటలు..

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు నిల్వ ఉంచే ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఎస్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. ప్రమాదానికి గల కారణాలపై భద్రతా బృందం దర్యాప్తు ప్రారంభించింది.

ఈ రెండో బ్లాక్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనితల పేషీలు ఉన్నాయి. అయితే తెల్లవారుజామున ఈ ఘటన జరగడం వల్ల, ఆ సమయంలో కార్యాలయాల్లో సిబ్బంది లేరు.

ఈ నేపథ్యంలో హోం మంత్రి అనిత అధికారులను సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్లు ఫైర్ శాఖ అధికారులు ఆమెకు తెలియజేశారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఘటనపై ఇంకా అధికారిక సమాచారం వెల్లడవాల్సి ఉంది.

Releated Posts

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ కీలక నిర్ణయాలు | చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి చర్యలపై మంత్రి మండలి కీలక నిర్ణయాలు…

ByByVedika TeamMay 9, 2025

పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..

భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్‌తో సమాధానం…

ByByVedika TeamMay 9, 2025

Leave a Reply