• Home
  • Andhra Pradesh
  • “మూడు ఏళ్లు వేచిచూడండి, వైసీపీ తిరిగి గెలుస్తుంది” – జగన్
Image

“మూడు ఏళ్లు వేచిచూడండి, వైసీపీ తిరిగి గెలుస్తుంది” – జగన్

మూడు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చే పార్టీ వైసీపీనే అని మాజీ సీఎం వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. “రాష్ట్రాన్ని మేమే పాలిస్తాం” అంటూ పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు. జగన్ 2.0 పాలన పూర్తిగా కొత్తగా ఉంటుందని, చంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు.

స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో గెలిచిన నాయకులతో భేటీ అయిన జగన్, పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలను అభినందించారు. “కష్టకాలంలో మీరు చూపించిన నిబద్ధతకు పార్టీ రుణపడి ఉంటుంది” అంటూ పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.

“మూడు సంవత్సరాలు కళ్లుమూసుకుంటే గడిచిపోతాయి. ఆ తర్వాత వైసీపీ అఖండ మెజారిటీతో గెలుస్తుంది” అని తెలిపారు. జగన్ 1.0తో పోలిస్తే జగన్ 2.0 పాలన గట్టిగా ఉంటుంది అన్నారు. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కి చేరాయి అని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 విధానంపై తీవ్ర విమర్శలు చేసిన జగన్, “సూపర్ సిక్స్, సూపర్ సెవన్ ఎగ్గొట్టేందుకు అప్పులపై అబద్ధాలు చెబుతున్నారు” అన్నారు. చంద్రబాబు పాలనలో మోసాలే కనిపిస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. “సంఖ్యాబలం లేకున్నా పోటీ చేసి, మా నాయకులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు” అని ఆరోపించారు.

“పోలీసులను అడ్డుపెట్టుకుని గెలవాలని చూశారు” అంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ ధ్వజమెత్తారు. రాబోయే రోజులు తమవేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Releated Posts

వైజాగ్‌లో డీఎస్పీ లైవ్ కాన్సెర్ట్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు!

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (DSP) తన ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్, బెంగుళూరు తర్వాత విశాఖపట్నం లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ప్లాన్ చేశారు.…

ByByVedika TeamApr 17, 2025

జేఈఈ మెయిన్ 2025 తుది ఫలితాలు ఇవాళ విడుదల – ర్యాంకులు, కటాఫ్‌ వివరాలు ఇదిగో…!!

హైదరాబాద్, ఏప్రిల్ 17:జేఈఈ మెయిన్ 2025 తుది విడత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ రోజు (ఏప్రిల్ 17) విడుదల చేయనుంది.…

ByByVedika TeamApr 17, 2025

పసిడి పరుగులు: గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా – ఈ ఏడాది చివరికి రూ.1.25 లక్షలు!

పసిడి పరుగులు పెడుతోంది. కేవలం మూడు అడుగుల దూరంలో లక్ష రూపాయల మార్కు కనిపిస్తోంది. ‘గోల్డ్‌ రేట్లు తగ్గుతాయి’ అని భావించినవారి అంచనాలను బంగారం…

ByByVedika TeamApr 16, 2025

75వ జన్మదినం సందర్భంగా చంద్రబాబు కుటుంబంతో విదేశీ పర్యటన…!!

ఏప్రిల్ 17వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి ఓ ప్రత్యేక విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.…

ByByVedika TeamApr 16, 2025

Leave a Reply