• Home
  • Entertainment
  • విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌: ప్యాన్‌ ఇండియా హిట్‌కు రెడీ!
Image

విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌: ప్యాన్‌ ఇండియా హిట్‌కు రెడీ!

విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం “కింగ్‌డమ్”, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రం మే 30న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కి ఎన్టీఆర్‌ వాయిస్ ఓవర్ ఇవ్వడం సినిమాపై హైప్‌ను పెంచింది. తమిళంలో సూర్య, హిందీలో రణ్‌బీర్‌ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.


నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు.

“మీరు ఎంత ఊహించుకున్నా, కింగ్‌డమ్” ఆ అంచనాలను మించి ఉంటుంది. కథ, లాజిక్స్, అన్ని రకాల ఎమోషన్స్ ఉండేలా ప్లాన్ చేశాం. ఎవరైనా ఏ డౌట్ అడిగినా నేనూ, గౌతమ్ తిన్ననూరి కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు.

కేజీయఫ్‌తో పోలికల గురించి అడిగిన ప్రశ్నకు

“కేజీయఫ్‌ బ్యాక్‌డ్రాప్‌తో మా సినిమాకు సంబంధం లేదు, కానీ యాక్షన్‌ సీక్వెన్స్, డ్రామా మాత్రం అంతకంటే పవర్‌ఫుల్‌గా ఉంటుంది” అని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ స్పెషల్ హైలైట్
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పారు.

“డైరెక్టర్ స్పాట్‌లో లేరు, కానీ కంటెంట్ నచ్చడంతో నువ్వున్నావ్ కదా.. చెప్పేద్దాం పద’ అంటూ ఎన్టీఆర్ ఎనర్జీగా వాయిస్ ఓవర్ ఇచ్చారు” అని గుర్తుచేసుకున్నారు.

ప్యాన్ ఇండియా హిట్‌కు విజయ్ దేవరకొండ రెడీ
ఫ్యామిలీ స్టార్” అనుకున్నంత పెద్ద విజయం సాధించకపోవడంతో, ఈసారి బ్లాక్‌బస్టర్ అందుకోవాలనే కసితో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌కు సీరియస్‌గా వర్క్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న మన రౌడీ హీరో, స్టోరీ సెలెక్షన్‌లో కొత్తదనం చూపిస్తూ ప్యాన్ ఇండియా హిట్ కోసం మాస్, క్లాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

🚀 మే 30న కింగ్‌డమ్ థియేటర్లలో – రెడీ అవ్వండి!

Releated Posts

విడాకుల బాటలో మరో జంట? నజ్రియా వ్యక్తిగత ఇబ్బందులతో ఆవేదన, సమంత స్పందన..!!

నజ్రియా నజీమ్.. మలయాళంలో ఈ చిన్నదానికి మంచి క్రేజ్ ఉంది. తెలుగులో మాత్రం ఒక్క సినిమాతోనే అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది. నేచురల్ స్టార్…

ByByVedika TeamApr 17, 2025

వైజాగ్‌లో డీఎస్పీ లైవ్ కాన్సెర్ట్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు!

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (DSP) తన ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్, బెంగుళూరు తర్వాత విశాఖపట్నం లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ప్లాన్ చేశారు.…

ByByVedika TeamApr 17, 2025

బన్నీ 3x పవర్ – అట్లీ డైరెక్షన్‌లో ట్రిపుల్ మాస్ ధమాకా!

‘పుష్ప 2’తో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు తన తదుపరి చిత్రంపై దృష్టి సారించాడు. ఈ సినిమాలో…

ByByVedika TeamApr 16, 2025

వెంకీ అట్లూరి-అజిత్ కాంబినేషన్‌లో కొత్త మూవీ… ఫ్యాన్స్ ఖుషీ!

టాలీవుడ్‌లో తనదైన శైలిలో విజయవంతంగా దూసుకెళ్తున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఇప్పుడు తమిళ స్టార్ అజిత్‌తో కలిసి సినిమా చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ‘సార్…

ByByVedika TeamApr 16, 2025

Leave a Reply