విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు! విశాఖ స్టీల్ ప్లాంట్‌ను బలోపేతం చేయడంలో కూటమి ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఉన్నతాధికారుల బృందం అమరావతిలో సీఎం చంద్రబాబును కలుసుకుని కీలక చర్చలు జరిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రివైవల్ ఫండ్ సద్వినియోగం, నిర్వహణ వ్యయాన్ని తగ్గించడంతో పాటు సామర్థ్యం పెంచే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు.

సమావేశంలో స్టీల్ ప్లాంట్ భద్రతకు SPF బలగాలను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం ఉన్న రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లతో పాటు మూడో ఫర్నేస్‌ను తిరిగి ప్రారంభించేందుకు చర్చలు జరిగాయి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ఉక్కు శాఖ సహాయమంత్రి శ్రీనివాస్ వర్మ, కార్యదర్శి సందీప్ పౌండ్రిక్, జాయింట్ సెక్రటరీ అభిజిత్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.