కావ్య మారన్.. కుర్రాళ్లకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఐపీఎల్ సీజన్ వచ్చినప్పుడల్లా ఆమె పేరు మారుమోగిపోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్‌గా కావ్య ప్రతి మ్యాచ్‌లో జట్టుకు మద్దతుగా ఉంటుంది. స్టేడియంలో ఆమె ఎమోషనల్ రియాక్షన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఆమె ఆనందం, నిరాశ, ఉత్సాహం – ఇవన్నీ అభిమానులను ఆకర్షించే అంశాలు.

ప్రస్తుతం కావ్య మారన్ గురించి ఓ వార్త నెట్టింట ట్రెండ్ అవుతుంది. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ దాదాపు ₹33,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలు. అయితే ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ రూమర్స్ ప్రకారం, కావ్య మారన్ కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అనిరుధ్ మరియు కావ్య ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అనిరుధ్ పర్సనల్ టీం దీనిపై స్పందిస్తూ, వారిద్దరూ మంచి స్నేహితులని, ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిపింది.

ఇదే కాదు, గతంలో అనిరుధ్ పేరు హీరోయిన్ కీర్తి సురేష్‌తో కూడా లింక్ అయింది. కానీ ఇటీవల కీర్తి తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడు అనిరుధ్ పేరు కావ్య మారన్‌తో కలిపి వినిపిస్తోంది. ప్రస్తుతం అనిరుధ్ దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రాచుర్యం పొందిన సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు.
ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు కానీ, కావ్య మారన్, అనిరుధ్ రూమర్స్ మాత్రం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి!