చియా విత్తనాలు పోషకంగా, ఆరోగ్యకరంగా ఉండే ఆహార పదార్థాలలో ఒకటి. వీటిలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, ఫాస్పరస్, జింక్, విటమిన్ బి1, బి3 పుష్కలంగా ఉంటాయి. గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. అయితే, వీటిని కొన్ని పదార్థాలతో కలిపి తినడం ఆరోగ్యానికి హానికరం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చియా విత్తనాలతో కలపకూడని పదార్థాలు:
✅ అధిక చక్కెర: ఎక్కువ చక్కెర కలిగిన ఆహారంతో చియా విత్తనాలను తినకూడదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
✅ అదనపు ఉప్పు: అధిక ఉప్పు వల్ల సోడియం మోతాదును పెంచుతుంది. ఇది అధిక రక్తపోటు సమస్యకు కారణమవుతుంది.
✅ అధిక కొవ్వు: అనారోగ్యకరమైన నూనెలు, వెన్న వంటివాటితో చియా విత్తనాలను తినకూడదు. ఇది గుండెకు హానికరం.
✅ మసాలా ఆహారం: మిరియాలు, కారం వంటి మసాలాలతో చియా సీడ్స్ తినడం జీర్ణ సమస్యలు కలిగించవచ్చు.
✅ నట్స్, సీడ్స్: వీటితో కలిపితే పొట్టలో నీరు పీల్చుకుని వాయువు, కడుపు నొప్పి వంటి సమస్యలు రానవచ్చు.
✅ కృత్రిమ తీపి పదార్థాలు: ఐస్‌క్రీం, స్మూతీల్లో చియా విత్తనాలను కలిపితే జీర్ణ సమస్యలు, రక్తంలో చక్కెర పెరిగే ప్రమాదం ఉంది.
✅ ప్యాక్ చేసిన జ్యూస్‌లు: ఇవి అధిక చక్కెర కలిగి ఉండటం వల్ల డయాబెటిస్ రోగులకు హానికరం.

చియా విత్తనాలను తినడం ఎలా?
చియా విత్తనాలను తినడానికి ముందు కనీసం 20-30 నిమిషాలు నీటిలో లేదా పాలలో నానబెట్టాలి. రోజుకు 1-2 చెంచాలు మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
(NOTE: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యల కోసం వైద్యులను సంప్రదించండి.)