టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ అధికారికంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. మార్చి 20న బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. ధనశ్రీ, చాహల్ విడాకుల పిటిషన్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇందులో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడటంతో, చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు.

హిందూ వివాహ చట్టం ప్రకారం, విడాకుల కోసం దంపతులకు ఆరు నెలల సమయం ఇవ్వాలి. అయితే, ధనశ్రీ, చాహల్ వెంటనే విడాకులు తీసుకోవాలని కోరారు. దీనితో, వారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. “మేము పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నాం. మాకు ఆరు నెలల వేచి ఉండాల్సిన అవసరం లేదు” అని పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు దీనిని సమీక్షించి, తక్షణమే విడాకులు మంజూరు చేయాలని కుటుంబ కోర్టును ఆదేశించింది.
అయితే, ఈ దరఖాస్తులో ఓ షాకింగ్ నిజం బయటపడింది. చాహల్, ధనశ్రీ 2020 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. కానీ 2022 జూన్‌లోనే విడిపోయారు. అంటే, పెళ్లయిన 19 నెలల్లోనే విడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆసక్తికరంగా, 2022 జూన్ తర్వాత కూడా ఈ జంట కలిసి కనిపించడం, ఫోటోలు దిగడం ఇప్పుడు నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది.