• Home
  • Andhra Pradesh
  • ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం..!!
Image

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం..!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

1. ఆర్థిక శాఖ
  • 2024-25 ఆర్థిక సంవత్సరానికి అవసరమైన అదనపు ఖర్చుల కోసం గ్రాంట్ల డిమాండ్ల అనుబంధ ప్రకటన మంత్రివర్గం ఆమోదించింది.
2. ఉన్నత విద్యా శాఖ
  • గుంటూరు జిల్లా నంబూరు గ్రామంలోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్శిటీ (VVITU) ను ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా గుర్తించేందుకు ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు మంత్రివర్గం ఆమోదించింది.
3. పాఠశాల విద్యా శాఖ
  • ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణకు “ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025” బిల్లు మంత్రివర్గం ఆమోదించింది.
4. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ
  • CRDA ప్రాంతంలో భూ కేటాయింపుల సమీక్ష కు మంత్రుల బృందం చేసిన సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
  • రూ.390.06 కోట్లు విలువైన APTRANSCO 400KV DC లైన్ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు.
  • రూ.834.46 కోట్లతో రోడ్లు, వరద కాలువలు, E13 రోడ్డు విస్తరణ కు అనుమతి.
  • రూ.22,607.11 కోట్లతో 22 పనులకు L1 బిడ్ల ఆమోదం.
5. జలవనరుల శాఖ
  • బుడమేరు డైవర్షన్ రెగ్యులేటర్ మరమ్మతులకు రూ.180.00 లక్షల నిధులు మంజూరు.
  • రూ.3797.00 లక్షలతో వరద నివారణ గోడల నిర్మాణానికి అనుమతి.
6. ఐటీ, స్టార్టప్ శాఖ
  • 2024-2029 ఆంధ్రప్రదేశ్ స్టార్టప్, ఇన్నోవేషన్ పాలసీ అమలుకు కేబినెట్ అనుమతి.
7. పరిశ్రమలు, వాణిజ్య శాఖ
  • ప్రీమియర్ ఎనర్జీస్, దాల్మియా సిమెంట్, లులు గ్రూప్ వంటి కంపెనీల పెట్టుబడులకు ఆమోదం.
  • 93,000 చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్.
8. ఇంధన శాఖ
  • అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 4000 MW పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్ట్ కు అనుమతి.
  • 1800 MW ఆఫ్-స్ట్రీమ్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కు 350 హెక్టార్ల భూమి కేటాయింపు.
9. పర్యాటక శాఖ
  • ఒబెరోయ్ విలాస్ రిసార్ట్ (కడప) మరియు మేఫేర్ హోటల్ & రిసార్ట్స్ (విశాఖపట్నం) ప్రాజెక్టులకు భూమి కేటాయింపు, మౌలిక వసతుల కల్పన.
10. రెవిన్యూ శాఖ
  • “వై.ఎస్.ఆర్. జిల్లా” పేరును “వై.ఎస్.ఆర్. కడప జిల్లా”గా మార్పు.
  • YSR తాడిగడప మునిసిపాలిటీ పేరు తాడిగడప మునిసిపాలిటీగా మార్పు.
11. సామాజిక సంక్షేమ శాఖ
  • షెడ్యూల్డ్ కులాల ఉప-వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక సిఫార్సులను ఆమోదించడం.
12. విపత్తు నిర్వహణ
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో రూ.6373.23 లక్షలతో పునరుద్ధరణ పనులకు పరిపాలనా అనుమతి.

ఈ నిర్ణయాల ద్వారా రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని, ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమల ప్రోత్సాహం పెరుగుతాయని ప్రభుత్వం అభిప్రాయపడింది.

Releated Posts

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ కీలక నిర్ణయాలు | చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి చర్యలపై మంత్రి మండలి కీలక నిర్ణయాలు…

ByByVedika TeamMay 9, 2025

పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..

భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్‌తో సమాధానం…

ByByVedika TeamMay 9, 2025

Leave a Reply