మంచు విష్ణు యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ “కన్నప్ప” షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాను, ప్రముఖ నటుడు మోహన్ బాబు అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. న్యూజిలాండ్ అడవులు, రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లలో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

దాదాపు ₹150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా మరో టీజర్ విడుదల చేయగా, ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈసారి విడుదల చేసిన టీజర్‌లో ప్రధానంగా యాక్షన్ పార్ట్ ను హైలైట్ చేశారు. అంతేకాకుండా, సినిమాలోని ముఖ్యమైన పాత్రలను రివీల్ చేశారు.

ఈ టీజర్‌లో శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్, అలాగే మోహన్ బాబు, మోహన్ లాల్ సహా ఇతర ముఖ్యమైన నటుల పాత్రలను చూపించారు. చివరలో ప్రభాస్ లుక్ కూడా రివీల్ చేయగా, అతని ఎంట్రీ టీజర్ హైలైట్‌గా నిలిచింది.