సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి పాన్-ఇండియా బ్లాక్ బస్టర్ల తర్వాత రాజమౌళి మరో గ్రాండ్ బడ్జెట్ మూవీని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు.

ఈ మూవీ కథ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగుతుందని టాక్. మహేష్ బాబు ఈ సినిమా కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. అలాగే తన లుక్, మేకోవర్ ను పూర్తిగా మార్చేసి, డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించనున్నారు.
ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది. మహేష్ బాబు కొత్త లుక్‌పై భారీ సస్పెన్స్ క్రియేట్ చేశారు. మహేష్ బాబు చాలా రోజులుగా పబ్లిక్‌లో కనిపించకపోవడంతో, అభిమానులు అతని లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే తాజాగా మహేష్ బాబు జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహేష్ లాంగ్ హెయిర్ స్టైల్‌లో అదరగొట్టాడు. ఫ్యాన్స్ కామెంట్స్‌లో “సింహం సిద్ధం అవుతుంది” అంటూ తెగ హంగామా చేస్తున్నారు. రాజమౌళి సినిమా కోసం మహేష్ తన ఫిజిక్‌ను బలంగా మార్చుకుంటున్నారు. బాడీ బిల్డ్ చేసేందుకు హార్డ్ వర్క్ చేస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ లుక్‌ను చూసి తెగ ఆనందిస్తున్నారు. మరి, మీరూ ఈ వీడియో చూసారా?